Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4007

ఎన్నఁ డిఁక యేది గొలఁదిపాటు

రాగము: దేసాక్షి

ఎన్నఁ డిఁక యేది గొలఁదిపాటు
వున్నతపు మాయలకే వొడిగట్టవలసె॥పల్లవి॥
  
  
చీ చీ మనసా చీ మనసా
కాచేటి పూచేటి వో ఘనజన్మమా
నీచు యెండమావులెల్లా నీళ్లంటా నమ్మినట్టు
చూచి చూచి యింద్రియాలే సుఖమనవలసె॥ఎన్నఁ॥
  
  
కట్టా జీవుఁడా కటకటా జీవుఁడా
తొట్టిన పంచభూతాలతోడి దేహమా
వెట్టిఁ జెఱకుపోలికి వెదురు నమలినట్టు
కట్టిన యీ కనకమే బ్రహ్మమనవలెసె॥ఎన్నఁ॥
  
  
బాపు బాపు దైవమా భావపు శ్రీవేంకటేశ
చూపుల నాయాతుమలో సుజ్ఞానమా
దోపుచుఁ బూవులవల్ల తుంగ దల కెక్కినట్టు
దాపగు నాలికె నిన్నుఁ దలఁచఁగవలసె॥ఎన్నఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!