Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4044

ఎన్నఁడొకో సుజ్ఞానము యీ యాత్మకు

రాగము: బౌళి

ఎన్నఁడొకో సుజ్ఞానము యీ యాత్మకు
కన్ను లెదిటివి చూచి కాలము నిట్టాయను॥పల్లవి॥
  
  
హేయములో సుఖము యెంగిలిలో సుఖము
కాయము నమ్మికదా కష్టపడెను
పాయములో చవులు పాపములో చవులు
మాయలు నమ్మికదా మనసూనిట్టాయను॥ఎన్న॥
  
  
కల్లలోని బదుకు కాసు వీసపు బదుకు
కల్లరి ప్రాణాలు నమ్మి కట్టుపడెను
యెల్లి నేఁటి తలఁపు యింద్రియాల తలఁపు
కొల్ల సంసారముఁగూడి గుణమునిట్టాయను॥ఎన్న॥
  
  
అంగడిఁబెట్టే సిరులు యలయింపులో సిరులు
దొంగజీవుఁడు యిట్లానే తొట్రుపడెను
అంగపు శ్రీవేంకటేశుఁడంతలో మన్నించఁగాను
ముంగిలెల్లా మోక్షమాయ ముచ్చటే యిట్టాయెను॥ఎన్న॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!