Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4058

ఎప్పటివాఁడవె కావా యెరుఁగుదుము

రాగము: కురంజి

ఎప్పటివాఁడవె కావా యెరుఁగుదుము
తప్పులు పట్టఁగ నిన్నుఁ దగదయ్య మాకును॥పల్లవి॥
  
  
చనవు సేసుక నే నీసరి నిలుచుందుఁ గాక
మన సిచ్చి నీవు నాతో మాట లాడేవా
వనిత లి దెరఁగరు వడి నేఁ గైకో నందురు
అనుమాన మెల్లఁ బాసె నంపవయ్య మమ్మును॥ఎప్పటి॥
  
  
వూర కైనా నేనే వట్టి వూడిగాలు సేతుఁ గాక
మేరతో నీవు గొంతైన మెచ్చఁ బొయ్యేవా
నేర మెల్లఁ దీర నేఁడు నిన్ను ముదులకించితి
పోర నోప నీతోను పోవయ్య్ చాలును॥ఎప్పటి॥
  
  
నంటున నీతో నేనే నవ్వులు నవ్వుదుఁ గాక
జంట యై నీ వట్టె సరసము లాడేవా
అంటిని శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
యింటికి వచ్చి కూడితి వేల వయ్య నన్నునూ॥ఎప్పటి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!