Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4093

ఎప్పుడు మీకే పోదు యింతవలెనా

రాగము: దేసాళం

ఎప్పుడు మీకే పోదు యింతవలెనా
కొప్పువట్టితే అప్పుడు కొంచెము గావలెనా॥పల్లవి॥
  
  
పలుకుల కొదదీరె పరాకు లిఁకనేలే
చెలువుఁడు చెప్పినట్టు నేయరాదా
నిలుచున్నాఁడిదె వచ్చి నిదుర నీ కింత యేలే
బలిమిఁ బట్టినమీఁద భ్రమయఁగవలెనా॥ఎప్పు॥
  
  
మనసు కోపమువాసె మరి చింత లిఁకనేలే
ఘనునిప్రియములెల్లఁ గైకోరాదా
తనుఁదానె వీడెమిచ్చి తలవంచ నీకేలే
చెనకి చేయిచేసుకొంటే సిగ్గువడవలెనా॥ఎప్పు॥
  
  
కాఁగిటిలో కొదదీరె కమ్మర జంకించనేలే
పీఁగక శ్రీవేంకటేశుఁ బిలువరాదా
రేఁగి యాతఁడు నవ్వీని రిచ్చలఁ గొంకఁగనేలే
మూఁగి యాతఁడు ముంచితే మొగమోట వలెనా॥ఎప్పు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!