Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4145

ఎరవు సేయ దెంతైనా నిన్నిటా నీదేవులు

రాగము: సామంతం

ఎరవు సేయ దెంతైనా నిన్నిటా నీదేవులు
పొరసి యీ గుణాలతోఁ బొగడొందుఁ గాని॥పల్లవి॥
  
  
వేడకకత్తైనది వేసారదు పతిపైని
జాడతో వలపులు చల్లుఁగాని
వాడిక గలిగినది వంతువాసు లెంచదు
కూడిమాడి కూరిములు కొసరుఁగాని॥ఎర॥
  
  
తగులాయమైనది తనియ దెంతైనాను
జిగిమించ నితవులే సేసుఁగాని
మిగులాఁ జుట్టమైనది మీరి పలుక దెప్పడు
పగటున నోరుపులే పచరించుఁగాని॥ఎర॥
  
  
ఆసకురాలైన ది అలయదు రతులను
పాసి తొలఁగ దెప్పడు పైకొనుఁగాని
సేసతో నిల్లాలైనది శ్రీవేంకటేశుఁడ నీకు
రాసికెక్క నిట్టె కాఁపురము సేయుఁగాని॥ఎర॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!