Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4161

ఎఱగని యాఁటదాని నెంత సేసేవు

రాగము: హిందోళం

ఎఱగని యాఁటదాని నెంత సేసేవు
వెఱగయ్యీ మాకు నీ విధములు చూచి॥పల్లవి॥
  
మట్టుమీఱ నవ్వునవ్వి మానముపైఁ జేయి వేసి
ఱట్టులు సేసేవుగా మెఱయ నింతిని
దిట్టమాటలాడి మోవితేనెల చవులు చూపి
యెట్టు బ్రమయించేవు యింతలో నీవు॥॥
  
సారె సారె గోరనూఁది జవ్వనము పెడరేఁచి
అరితేరి నవ్వేవుగా అంగనను
నేరుపులు వచరించి నెట్టుకొని కొంగువట్టి
యీరీతినేల పఱచే విదివో నీవు॥॥
  
చన్నులంట గాఁగిలించి సరసములాడి యాడి
యెన్నిరతులఁ గూడేవు యీకన్నె నీవు
నన్ను శ్రీవేంకటేశుఁడ నమ్మించి యేలితివి
మన్నించి యెంత మెచ్చేవు మమ్మునిట్టే నీవు॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!