Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4197

ఎఱుఁగుదు మిన్నియును ఇంతే శేల

రాగము: మాళవిగౌళ

ఎఱుఁగుదు మిన్నియును ఇంతే శేల
వఱవాతా నింకా నింతవారమా నేము॥పల్లవి॥
  
  
మాటలనే చొక్కితిమి మంతనాలు మెచ్చితిమి
తాఁటలఁదూఁటలచేతఁ దనిసితిమి
యేఁటికి మమ్ముఁ జెనకీ నిన్నిటాఁ జుట్టాలము
వాఁటముగ నిఁక వింతవారమా నేము॥ఎఱుఁ॥
  
  
నగవుల నలసితిమి నయముల నమ్మితిమి
తగవులు నెరపఁగాఁ దనిసితిమి
మొగము లేమిచూచీని మోహించినవారము
వగలేల యింకా వింతవారమా నేము॥ఎఱుఁ॥
  
  
మోవితేనె లానితిమి ముచ్చటలఁ గూడితిమి
తావుల సరసములఁదనిసితిమి
యేవల్లా శ్రీవేంకటేశు కిచ్చకపుసతులము
వావిగూడె నింకా వింతవారమా నేము॥ఎఱుఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!