Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4200

ఎఱుఁగుదు రందరును యేల దాచేవు మోహము

రాగము: శ్రీరాగం

ఎఱుఁగుదు రందరును యేల దాచేవు మోహము
వెఱపేల ఇఁకఁ దెర వేసుకోరాదా॥పల్లవి॥
  
  
ననువునఁ జవరాలు నాఁటఁగంజూచినచూపు
తనివోనినీకుఁ బైతరవాయను
మొనగోరి చేతుల మొక్కినమొక్కులు నేఁడు
యెనలేనివలపుల కెచ్చరికకలాయను॥ఎఱు॥
  
  
సొరిది నప్పటి నాపె సొలసి యాడినమాట
మరిగించేమచ్చుమేపుమందాయను
సిరులుమించినయట్టిసెలవులనవ్వులు
బెరయనిరతులకుఁ బెడరేఁపులాయను॥ఎఱు॥
  
  
యిట్టె నీదేవులు చేతికిచ్చినయీకానుక
జట్టిగాన్నకాఁగిలే లంచములాయను
నెట్టన శ్రీవేంకటేశ నెమ్మి నీకె నేలితివి
చుట్టరికము లివియే సులభములాయను॥ఎఱు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!