Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4223

ఎఱఁగనివాఁడవా యేమయ్యా నీవు

రాగము: కాంబోది

ఎఱఁగనివాఁడవా యేమయ్యా నీవు
మఱవవచ్చునా మేలు మన్నింతురుగాక॥పల్లవి॥
  
  
సరసములాడితేను సాకిరివెట్టుదురా
వొరసివొరసి నవ్వుదురుగాక
శిరసువట్టితేనే చేతుల బిగింతురా
కరఁగినమనసుతో కైకొందురుగాక॥ఎఱఁ॥
  
  
తచ్చితచ్చి చూచితేను తలవంచుకొందురా
ఇచ్చగించి గక్కనఁ జేయిత్తురుగాక
పచ్చిమాటలాడితేను పరాకు సేయుదురా
అచ్చమైనచనుఁగొండ లంటుదురుగాక॥ఎఱఁ॥
  
  
అట్టె కాఁగిలించుకొంటె ఆయాలు ముట్టుదురా
నెట్టుకొని యిట్టె కరుణించితురుగాక
గుట్టున శ్రీవేంకటేశ కూడినింతి జంకింతురా
చుట్టురికములెల్లాను చూపుదురుగాక॥ఎఱఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!