Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4229

ఎఱఁగమా నీగుణాలు ఇందరిలోన

రాగము: బౌళి

ఎఱఁగమా నీగుణాలు ఇందరిలోన
మఱవక మమ్ము నిట్టె మన్నించవయ్యా॥పల్లవి॥
  
  
మంతనాన మాపుదాఁకా మాటలాడి తనియవు
యెంతలేదు నీయాసోద మేమి చెప్పేది
చెంతల గోర గీరినా సిగ్గులువడవు నీవు
ఇంతటి నీవాసిపట్టు యెంచఁగ నేమున్నది॥ఎఱఁ॥
  
  
ననుపున నాతోను నవ్వు నవ్వి వేసారవు
పనిపూనినబిరుదుబంట వౌదువు
చెనకి యెంత దూరినా శిరసు వంచుకొనవు
పనుపడ నీపంతాలు పచారించనేఁటికి॥ఎఱఁ॥
  
  
కడఁగి నన్నుఁ గూడి కాఁగిటిలో నలయవు
యెడయక నీనేర్పు లెట్టు మెచ్చేది
కడుఁబెనఁగినాను లోఁగవు శ్రీవేంకటేశ్వర
బడిబడి నీపొందు పాయ దెన్నటికి॥ఎఱఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!