Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4247

ఎఱఁగమైతిమయ్య (మమ్మ?) యిన్నాళ్ళును

రాగము: లలిత

ఎఱఁగమైతిమయ్య (మమ్మ?) యిన్నాళ్ళును
కఱకరిఁ బెట్టఁగోరే కాతరీఁడా తాను॥పల్లవి॥
  
  
పొందులిట్టే రేఁచఁగాను పొత్తులు వేడుకలాయ
సందడించఁగా వలపు చవులాయను
యిందాఁకాఁ దనమనసెవ్వరిదై వుండెనే
ముందు వెనక లెంచని మొక్కలీఁడా తాను॥ఎఱఁగ॥
  
  
కాయము గిలిగించఁగా గక్కన నవ్వులు వుట్టె
చేయి చేతనంటఁగాను చెమరించెను
పాయపుమదమెవ్వతె పంచనుండెనే యిన్నాళ్ళు
చాయలు సన్నెరఁగని జడ్డువాఁడా తాను॥ఎఱఁగ॥
  
  
గక్కున నేఁగూడఁగాను కళలు మోమున నిండె
నొక్కుచు మోవియ్యఁగాను నోరూరెను
యిక్కువ శ్రీవెంకటేశుఁడెంత భ్రమసి వుండెనే
యెక్కువ నాతోరమించె నిచ్చకుఁడా తాను॥ఎఱఁగ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!