Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4256

ఎఱఁగవా నాచేత నింతేశాడించుకోనేల

రాగము: నాగగాంధారి

ఎఱఁగవా నాచేత నింతేశాడించుకోనేల
మఱచిన పనులకు మగిడి చూడనేలా॥పల్లవి॥
  
పైకొని నాతో నీవు బాసలు సేయఁగనేల
నీకు నిజమే కలితే నిష్టూరమేల
యేకమైన పొందులకు యెడమాటలాడనేల
సాకిరిలేని పనికి సాదించనేల॥॥
  
కొన్నది కోలై నందుకు కొలఁది వెట్టిఁగనేల
చిన్ననాటి సుద్దులకు సిగ్గులేల
అన్నిటా నేర్పరి వైతే నంతనీకు లోఁగనేల
నిన్నటి చీఁకటికి నేఁడు దీపమేలా॥॥
  
వేడుకకాఁడవు నీవు వెఱపులు మరి యేల
కూడితివి నన్ను నిఁకఁ గొసర నేల
పాడితో నడచే నీకు పంతములు మరి యాల
వాడికె శ్రీవేంకటేశ వంకలొత్తనేలా॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!