Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4259

ఎఱఁగవా నీవేమైనా యిన్నిటా నేరుపరివి

రాగము: బౌళి

ఎఱఁగవా నీవేమైనా యిన్నిటా నేరుపరివి
జఱయుచు నవ్వఁగాను సాదింతు రటవే॥పల్లవి॥
  
  
సముకాన నాతడు సన్నలు సేయఁగానే
తమకించి మాటాడఁ దగవౌ నటే
చెమరించు కొంటాను చేరి ప్రియాలు చెప్పఁగా
బొమముడి జంకెనలు పొందౌనటే॥ఎఱ॥
  
  
యియ్యకోలుగా నీకు నిచ్చకము సేయఁగానే
సయ్యాటానఁ బెనఁగఁగ సంగతౌనటే
నెయ్యముతో గాసిపడి నీదిక్కు చూడగాను
కొయ్యతనానఁ గొసరు గూడునటవే॥ఎఱ॥
  
  
మంతనాల నాతఁడు మర్మములు ముట్టఁగాను
పంతములు నెరఁపగ బాగౌనటే
యింతలోనె శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ గూడె
చెంతనుండి సిగ్గువడఁ జెల్లునటవే॥ఎఱ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!