Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4261

ఎఱఁగవితని చంద మిట్టివాఁడనుచు నింతి

రాగము: ముఖారి

ఎఱఁగవితని చంద మిట్టివాఁడనుచు నింతి
తెఱవల నీమీఁదఁ దేనోపుఁ జుమ్మీ॥పల్లవి॥
  
  
రంగుమీరిన మంచిరత్నాలు దాచిన నీ-
వుంగరాలచేతఁ బాదమొత్తకువవ్మ
అంగన వుట్టెనుఁ బాదమంటి శిలను దొల్లి
కంగి నీకుఁ బ్రతిమొన గడియించీఁ జుమ్మీ॥ఎఱఁగ॥
  
  
కొమ్మ నీదు వాలారుగోళ్ళ నితనికిని
యిమ్ములఁ దొడలు సోఁకనియ్యకు వమ్మా
దొమ్ముల సిరుల గోరఁ దొడనింతిఁ బుట్టించె
కమ్మర నీకు నిట్టెకలిగించీఁ జుమ్మీ॥ఎఱఁగ॥
  
  
నొక్కుచుఁ జెమటల పానుపున వేంకటపతి-
నుక్కున నీచనుఁగొండలొత్తకువమ్మా
పక్కనను గొండవేసి పానుపుజలది దచ్చె
చక్కని తరుణి నిట్టె సడిఁబెట్టీఁ జుమ్మీ॥ఎఱఁగ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!