Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4339

ఎవ్వరినేల తడవేవీడ వారేమి సేతురు

రాగము: మాళవిగౌళ

ఎవ్వరినేల తడవేవీడ వారేమి సేతురు
జవ్వన పాయముమీఁద సడివేయవే॥పల్లవి॥
  
  
మందలించి మాతోనేల మాటలకు వచ్చేవు
కందువలు పతినడుగవే నీవు
అంది వుండఁబట్టకుంటే ఆతని నిన్నుఁగూర్చిన
ముందరి మరునికే మొరవెట్టవే॥ఎవ్వ॥
  
  
యిల్లురికి మాతోనేల యీసడించ వచ్చేవు
చెల్లుబడాతనిమీదఁ జేయవే నీవు
పల్లదమంత గలిగితే పై పై నెడమాటలాడే
తెల్లమైన నీచెలులఁ దిట్టవే నీవు॥ఎవ్వ॥
  
  
సంగడిఁ గూచుండి నీవు సణఁగులేల రాల్చేవు
బంగించి యీతనిఁ దప్పుపట్టవే నీవు
రంగై శ్రీ వేంకటేశుఁడు రమించె నీతఁడు నాతో
అంగడి జాణతనములాడవే నీవు॥ఎవ్వ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!