Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4466

ఎండగాని నీడగాని యేమైనఁగాని

రాగము: బౌళి

ఎండగాని నీడగాని యేమైనఁగాని
కొండలరాయఁడే మా కులదైవము॥పల్లవి॥
  
  
తేలుగాని పాముగాని దేవపట్టయినఁగాని
గాలిగాని ధూళిగాని కాని యేమైనా
కాలకూటవిషమైన గక్కున మింగిన నాటి
నీలవర్ణుఁడే మానిజ దైవము॥ఎండ॥
  
  
చీమగాని దోమ గాని చెలఁది యేమైనఁగాని
గాముగాని నాముగాని కాని యేమైనా
పాములన్నిమింగే బలుతేజిపైనున్న
ధూమకేతువే మాకు దొర దైవము॥ఎండ॥
  
  
పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైనఁగాని
కల్లగాని పొల్లగాని కాని యేమైనా
బల్లిదుఁడై వేంకటాద్రిపైనున్నయాతఁడే మ-
మ్మెల్లకాలమును నేలేయింటి దైవము॥ఎండ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!