Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4499

ఎంతకెంత విచారములేమున్నవి

రాగము: హిజ్జిజ్జి

ఎంతకెంత విచారములేమున్నవి
పొంతల నేము చేసిన పుణ్యమిదిగాక॥పల్లవి॥
  
  
మరిగినదాన నే మాటల దూరితిఁ గాక
దొరవు కోపములు నీతోఁ జెల్లునా
తెరమరుఁగింతె నీవు తెలియనిదేమున్నది
పొరసి నేము సేసిన పుణ్యమిదిగాక॥ఎంత॥
  
  
పాయపుదాననై పదరి అంటితిఁ గాక
చాయకాఁడవు నీతో సలిగెల నా
నాయములెంచి చూచితే నాకు నీకు భేదమేది
పోయినరాత్రి సేసిన పుణ్యమిది గాక॥ఎంత॥
  
  
మనసులోదాననై మర్మములు రేఁచితిఁగాక
చెనకి నీమేను పచ్చిసేయఁదగునా
ఘనుఁడ శ్రీ వెంకటేశ కలసితిమిద్దరము
పొనుఁగక నేఁజేసిన పుణ్యమిదిగాక॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!