Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4534

ఎంత చదివిన నేమి వినిన తన-

రాగము: సామంతం

ఎంత చదివిన నేమి వినిన తన-
చింతయేల మాను సిరులేల కలుగు॥పల్లవి॥
  
  
ఇతర దూషణములు యెడసినఁగాక
అతికాముకుఁడుగాని యప్పుడు గాక
మతిచంచలము గొంత మానినఁగాక
గతి యేల కలుగు దుర్గతులేల మాను॥ఎంత॥
  
  
పరధనములయాస పాసినఁగాక
అరిదినిందలులేనియప్పుడు గాక
విరసవర్తనము విడిచినఁగాక
పరమేల కలుగు నాపదలేల మాను॥ఎంత॥
  
  
వేంకటపతి నాత్మ వెదకినఁగాక
కింక మనసునఁ దొలఁగినఁగాక
బొంకుమాట లెడసిపోయినఁగాక
శంకయాల మాను జయమేల కలుగు॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!