Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4554

ఎంత చెప్పినా వినవు యేలే నీకు

రాగము: దేశాక్షి

ఎంత చెప్పినా వినవు యేలే నీకు
మంతనాన రమణుఁడు మనసిచ్చీ నీకును॥పల్లవి॥
  
  
నిండిన కళలమోము నివ్వెర పరచకువే
కొండవంటిపతి నిన్నుఁ గొంగువట్టఁగా
యెండకంట నీడకంట నేల చూచేవే యాతని
పండువంటిమోవి చూచి పాలార్చీ నిన్నును॥ఎంత॥
  
  
బంగారువంటిమేను పయ్యద మూసుకోకువే
సింగారపురమణుఁడు చేయిచాఁచఁగా
చెంగి పచ్చిమాటలు వెచ్చినమాటా నాడకువే
అంగమంటి చెక్కునొక్కి యాదరించీ నిన్నును॥ఎంత॥
  
  
తుమ్మిదవంటిబొమ్మలు తోడ ముడివెట్టకువే
నెమ్మి శ్రీవేంకటపతి నీతో నవ్వఁగా
సమ్మతించి చనవిచ్చి సమరతి వీఁగకువే
కమ్మరఁ గమ్మరఁ గూడి కరగించె నితఁడు॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!