Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4568

ఎంతటిది నీ యాసోద మేమి చెప్పేది

రాగము: దేశాక్షి

ఎంతటిది నీ యాసోద మేమి చెప్పేది
వింతలుగా నవ్వేవు వెలఁదులతోడను॥పల్లవి॥
  
రాచిలుకపలుకుల రవళితోడి కొమ్మ
వూచినతంగేడువంటి పుత్తడిబొమ్మ
యేచి నీవురముమీఁద నిట్లానే వుండఁగాను
చాఁచేవు చేతులప్పటి జవరాండ్లమీఁదను॥ఎంతటి॥
  
కదలుఁజూపుల తేఁటిగతి కన్నుల కలికి
పొదలిన రతిరాజు పూవుములికి
మెదలుచు నేపొద్దు నీమెడదఁడై వుండఁగాను
గుదిగొన నంటేవు గొల్లెతల చన్నులు॥ఎంతటి॥
  
కారుమెఱుఁగులవంటి కళల చంద్రవదన
గారాపు సింగారాల పంకజసదన
యీరీతి శ్రీవేంకటేశ యీ నీకాఁగిటఁ గూడఁగా
చేరి యేలేవు మావంటి చెలుల నందరిని॥ఎంతటి॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!