Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4574

ఎంతటివాఁడవు నిన్ను నేమని నుతింతును

రాగము: లలిత

ఎంతటివాఁడవు నిన్ను నేమని నుతింతును
చింతలు నీ కమరకుండఁగా విచారించే నేను॥పల్లవి॥
  
  
పాలసముద్రములోనఁ బవళించివుండే నీకు
బాలుఁడవైతేనే వెన్న బాఁతాయెనా
కాలమెల్లను శ్రీకాంత కౌఁగిటనుండే నీకు
గోలవైతే గొల్లెతలఁ గడ వేడు కాయెనా॥ఎంతటి॥
  
  
పరమపదమునందు బ్రహ్మమై వుండే నీకు
పెరిగి రేపల్లె నాడఁ బ్రియమాయెనా
సురల నెల్లాఁ గావ సులభుండవైన నీకు
గరిమెతోడఁ బసులఁ గాన వేడు కాయెనా॥ఎంతటి॥
  
  
యేపొద్దు నిత్యముక్తుల నెనసివుండే నీకు
గోపాలులతోఁ గూడుండఁ గోరి కాయెనా
బాపురే యలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వర
యేపొద్దు నిట్టి లీలలె యితవాయెనా॥ఎంతటి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!