Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4645

ఎంత నేరుచుకొంటివి యేమందు నిన్ను

రాగము: దేసాళం

ఎంత నేరుచుకొంటివి యేమందు నిన్ను
మంతుకెక్క నెంచేఁగాని మతకము గాదు॥పల్లవి॥
  
  
తరుణులఁగంటే నీవు తగిలేయాసోదానను
వెరగై వుందానఁగాని వేసాలు గావు
మరిగించి నీవాడేటిమాఁట నయగారాలకు
అరుదందేఁగాని నీపై నాగడము గాదు॥ఎంత॥
  
  
తోడనే నీ మొగమునఁ దొలఁకేకళలు చూచి
వేడుకకు నవ్వేఁగాని వెంగెము గాదు
యేడనుండైనా వచ్చి ఇంపులు సేసేయందుకు
జాడతో మొక్కేఁగాని సటలు గావు॥ఎంత॥
  
  
ఇచ్చకము లెల్లాఁజేసి ఇట్టె నన్నుఁ గూడఁగాను
రచ్చకెక్కి మెచ్చేఁగాని రవ్వలు గావు
మచ్చిక శ్రీవేంకటేశ మన్నించితి విటు నన్ను
కొచ్చి సంతోసించేఁగాని కొసరు గాదు॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!