Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4670

ఎంత పుణ్యమో నీకు హీనుని రక్షించితివి

రాగము: సామంతం

ఎంత పుణ్యమో నీకు హీనుని రక్షించితివి
యింత సేసితివి భాగ్య మేమి చెప్పీ నింకను॥పల్లవి॥
  
  
సరుగ నానోర నీవు సంకీర్తన విన్నపుడే
ఆరసి మోక్ష మిత్తువని నే నమ్మితి
పరుల బంటుఁగా జేయక యప్పటి నన్నేలి నపుడే
నరకమందుఁ బెట్టవు నమ్మితి నేను॥ఎంత॥
  
  
కిమ్ముల నిఁక విన నీ కీర్తి గట్టినపుడె
నెమ్మి రక్షింతు వనుచు నే నమ్మితి
పమ్మి నా మదిలో నీ రూపము చూసినపుడే
క్రమ్మరఁ బుట్ట ననుచు గక్కన నే నమ్మితి॥ఎంత॥
  
  
యిట్టె యోగక్షేమము వహించుకొని యున్నపుడె
నెట్టుకొనె నీ కృపని నే నమ్మితి
గట్టి శ్రీవేంకటేశ లోకదృష్టాంతమైనపుడే
వొట్టి సకలకర్మము లూడె నని నమ్మితి॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!