Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4685

ఎంత బలిమికత్తెవు యేమే నీవు

రాగము: రామక్రియ

ఎంత బలిమికత్తెవు యేమే నీవు
మంతనమాడకుండాను మానిపేవా నీవు॥పల్లవి॥
  
  
కామించి యాతఁడు నాసంగడి గూచుండెనంటాను
యేమేమి మాటలాడేవే యింతలో నీవు
నీ మగఁడే నాచేతికి నిమ్మపండిచ్చెనంటాను
గామిడిచేఁత చేసేవు కానీవే నీవు॥ఎంత॥
  
  
ఇంతలో నాతఁడు మా ఇంటికి వచ్చెనంటాను
యెంతేసి నవ్వులు నవ్వే వేమే నీవు
దొంతరవలపుతో నా తొడపైఁ బండున్నాఁడంటా
పంతములే నెరపేవు పైకొనుచు నీవు॥ఎంత॥
  
  
కడఁగి పాన్పుపై నన్ను గాఁగిలించుకొనెనంటా
యెడచొచ్చి కూడేవు యేమే నీవు
అడరి శ్రీవేంకటేశుఁడాతఁడు నీవాఁడంటా
బడివాయక వుండేవు పచ్చిదేర నీవు॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!