Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4755

ఎంతలేదు నాయాస యేమి చెప్పేను

రాగము: రామక్రియ

ఎంతలేదు నాయాస యేమి చెప్పేను
పంతమున నీవల్ల బతు కెల్లాఁ గలది॥పల్లవి॥
  
  
నీచిత్తము నామీఁద నిజముగాఁ బారితేను
యేచిన నావలపెల్లా నీడేరును
పూచినపూవులలోన పూఁపలు బలువైతేనే
కాచినకాపెల్లా నట్టె కడుఫలియించును॥ఎంత॥
  
  
చనవిచ్చి నీవు నాతో సరసములాడితేనే
యెనసిననాసేవ లీడేరును
వెనుకొన్నసంపదలు వెంట వెంటఁ దిరిగితే
యెనలేని రాజసము లింతా నీడేరును॥ఎంత॥
  
  
సేసవెట్టినట్టె(ట్టి?) నీవు చెప్పినట్టు సేసితేను
వేసరనివాకాఁగిలి వేడుకలౌను
యీసులేక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
లాసి నీటికొలఁదే లలితోఁ దామెరలూ॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!