Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4823

ఎంత వేగిరకాఁడ వేమయ్య నీవు

రాగము: శుద్ధదేశి

ఎంత వేగిరకాఁడ వేమయ్య నీవు
చెంత నూరకుండఁగానే సేసలు చల్లేవు॥పల్లవి॥
  
  
సెలవి నవ్వులతోడ సిగ్గువడి వుండఁగానే
బలిమి నాపెచన్నులు పట్టితీసేవు
నిలువుఁదమకమున నివ్వెర గందఁగానే
కొలఁదిమీరఁగను గక్కునఁ జెనకేవు॥ఎంత॥
  
  
తగు నీపై తలపోఁత తలఁచుకుండఁగానే
చిగురుఁబెదవి యాని చిమ్మి రేఁచేవు
మొగము చూచి నీపై మోహములు నెరపఁగా
బిగువుఁగాఁగిట నొత్తి పిప్పిసేసేవు॥ఎంత॥
  
  
ముద్దులు గునిపి నీతో ముచ్చటలడఁగానే
అద్దుకొని రతికేలి నలయించేవు
గద్దించి శ్రీవేంకటేశ కన్నుల మొక్కఁగానే
పెదరికానకు సారెఁ బెనఁగులాడేవు॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!