Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4826

ఎంత వేగిరకాఁడ వేమోయి

రాగము: ముఖారి

ఎంత వేగిరకాఁడ వేమోయి
పంతగాఁడ వింతలోనే పదరకువోయీ॥పల్లవి॥
  
  
చెక్కు నొక్కఁ బొద్దు లేదో చేఁత సేయఁ బొద్దు లేదో
అక్కర దీరఁగ మాటలాడవోయి
యిక్కు వంటఁ బొద్దు లేదో యేఁటికైనా బొద్దు లేదో
యెక్కువ కప్పురవీడె మిందవోయి॥ఎంత॥
  
  
చేయి చాఁచఁ బొద్దు లేదో సేస వెట్టఁ బొద్దు లేదో
సోయగపు నీ మోము చూపవోయి
మోయ నవ్వఁ బొద్దు లేదో మోవి యానఁ బొద్దు లేదో
నీ యలపు దీరఁ గొంత నెత్తమాడవోయి॥ఎంత॥
  
  
పచ్చిసేయఁ బొద్దు లేదో పైకొనఁగఁ బొద్దు లేదో
యిచ్చగాఁగఁ గిన్నెర వాయించవోయి
కుచ్చి నన్నుఁ గౌఁగిటనుఁ గూడితి శ్రీవేంకటేశ
మచ్చికె యీ ప్రేమ మిట్టే మఱవకువోయి॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!