Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4839

ఎంత వేడుకో నీకు నింతి సేసే సేవలు

రాగము: హిందోళం

ఎంత వేడుకో నీకు నింతి సేసే సేవలు
చెంతనుండి చూచేమాకు సిబ్బితయ్యీ నిపుడు॥పల్లవి॥
  
  
కొప్పులోని మొగలి రేకులతావి దొలఁకగాను
చెప్పీ నేకతమునీకు చెవిలోనికే
చిప్పిలుఁజెమటలెల్లా చేతుల జొబ్బలఁగాను
అప్పుడే పాదములొత్తీ నంగ మల్లాఁ దడియ॥ఎంత॥
  
  
చెక్కులజవ్వాది నీముఁజేతులపైన వడియఁగా
మొక్కి నీవు చెనకఁగా మోహాన నీకె
పుక్కిటితమ్ములము గొబ్బున నీమైఁ జెదరఁగా
మిక్కిలి నవ్వీఁ గుంచమే కొని విసరుచు॥ఎంత॥
  
  
గుబ్బల నలఁగిన కుంకుమ నీమై నంటఁగా
వుబ్బునఁ గాఁగిట నించి వొరసీ నీకె
అబ్బురాన నన్నేలితి వన్నిటా శ్రీవేంకటేశ
నిబ్బరానఁ దానూఁ జేసీ నీకు నూడిగములు॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!