Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4928

ఎందాఁక నేచిత్త మేతలఁపో

రాగము: శ్రీరాగం

ఎందాఁక నేచిత్త మేతలఁపో
ముందుముందు వేసారితి ములిగి వేసారితి॥పల్లవి॥
  
  
ఏమిసేతు నేడచొత్తు నేమని బోధింతును
నామాఁట విన దిదే నావిహరము
యేమరినాఁ దలఁపించీ నేమైనా గడించీ
సాముసేసి వేసారితి జడిసి వేసారితితి॥ఎందా॥
  
  
యేడ చుట్టా లేడ బంధు లేడ పొందు లెవ్వరూ
తోడైనవారుఁ గారు దొంగలుఁ గారు
కూడుచీరగానిచోటై కొరగానిపాటై
వాడివాడి వేసారితి వదిలి వేసారతి॥ఎందా॥
  
  
యెందునున్నాఁ డేమిసేసీ నెక్కడ భోగించీని
విందులకువిందయినవేంకటేశుఁడు
యిందరిహృదయములో నిరవై యున్నాఁ డతఁడు
చెంది నన్నుఁ గాచుఁగాక చెనకి వేసారితి॥ఎందా॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!