Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4937

ఎందాఁకా నవ్వులు నవ్వే వీపెతోను

రాగము: బౌళి

ఎందాఁకా నవ్వులు నవ్వే వీపెతోను
ఇందరిలోనాఁ జనవులియ్యవయ్య ఇపుడు॥పల్లవి॥
  
  
ముంచక మునుకలాయ మొదల నీపైవలపు
పెంచకే పెద్దలాయను పెనుచన్నులు
మంచినీటిచెలమాయ మరియును తేనెమోవి
నించరాదా నీకరుణ నెలఁతపై నిఁకను॥ఎందా॥
  
  
కూడఁగూడఁ గుప్పలాయ కొప్పులోని కీనెరులు
వాడనిచిగురువలె వచ్చె వయసు
వూడుచరానితగులై వున్నది నీనేస్తము
వేడుకఁ గూడఁగరాదా వెలఁది నింతటను॥ఎందా॥
  
  
చెప్పఁజెప్పఁ గొత్తలాయ చెంతనే సింగారము
అప్పటి పెండ్లిచవికాయఁ గాఁగిలి
చిప్పిల నేలుకొంటివి శ్రీవేంకటేశ్వర
మెప్పించరాదా యలమేల్‌మంగను రతుల॥ఎందా॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!