Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4972

ఎందాఁకఁ దెరలోన నేమి సేసేవు

రాగము: మంగళకౌశిక

ఎందాఁకఁ దెరలోన నేమి సేసేవు
చందమాయఁ బనులెల్లా చనవియ్యఁగదవే॥పల్లవి॥
  
  
చిలుకలకొలికి సిగ్గులు వడనేఁటికి
పలుకఁగదవే నీపతితోను
పిలిచి యాతఁడు నీకుఁ బ్రియములు చెప్పీని
అలుకలు దేరినిఁక నండకు రాఁగదవే॥ఎందాఁ॥
  
  
వనముకోగిలా వట్టిజాగులేఁటికే
కనుఁగొనవే నీకాంతునిని
చనవిచ్చి యాతఁడు సరసములాడీని
మనసులు గలిసెను మంతనమాడఁగదే॥ఎందాఁ॥
  
  
కొలని రాయంచా కొంక నీకేఁటికే
కలయఁగదే శ్రీనేంకటేశ్వరుని
లలినేలి నిన్నాతఁడు లాలించి కాఁగిలించి
వలపుల మితిమీరె వడదేర్చఁ గదవే॥ఎందాఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!