Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4975

ఎందుకు రోయ విదేరా యెంతపాపము

రాగము: సాళంగనాట

ఎందుకు రోయ విదేరా యెంతపాపము
ఇందరిచేతా వింటి యీ పాపము॥పల్లవి॥
  
  
వూరకున్నయాఁట దాని నొక్కొక్క ఆసరేఁచి
ఆరయఁ బరాకుసేయు టది పాపము
చేరువ నుండినదానిఁ జేకొన కప్పటిని
కోరి వేరేసతిఁ దెచ్చుకొంట గడుఁబాపము॥ఎందు॥
  
  
కలయనిముద్దరాలిఁ గన్నెరికము చేకొని
అలరుచు సిగ్గువడే దది పాపము
వలచినవా రుండఁగ వాడవారివెంటవెంట
మెలఁగి తిరిగాడేది మిక్కిలిఁ బావము॥ఎందు॥
  
  
వొప్పగుపట్టపు దేవి నురమునఁ బెట్టుకొని
అప్పటి దిక్కులు చూచే దది పాపము
యిప్పుడె శ్రీ వేంకటేశ యీడ నన్నుఁ గూడితివి
యెప్పటి కెప్పటిసుద్దు లేఁటిపాపము॥ఎందు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!