Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4991

ఎందునుఁ బోరాదు ఆతఁడేమి సేసునే

రాగము: ముఖారి

ఎందునుఁ బోరాదు ఆతఁడేమి సేసునే
యిందునే విట్ఠలుని నీవెంత సేసేవే॥పల్లవి॥
  
అంగన నీమాలెల్ల నాదరించి వినఁగానే
పంగించి యాతనికేదో పరాకనేవే
ముంగిటి నీమొక్కులెల్ల మొగి నెంచుకొనఁగానే
అంగవించి యెందో మాటలాడీ ననేవే॥॥
  
నమ్మిక నీచేఁతలకు నవ్వులాతఁడు నవ్వఁగ
చిమ్మిరేఁగి అవి యేదో సిగ్గులనేవే
తమ్మిరేకుఁ గన్నులను తప్పకిట్టే చూడఁగాను
యిమ్ముల నవి గొన్ని యెమ్మెలనేవే॥॥
  
గక్కన నాతడు నిన్నుఁ గాఁగిలించి కూడఁగాను
తక్కకెవ్వతెపైదో కాతరమనేవే
యిక్కువ శ్రీవేంకటేశుఁ డీతఁడే నిన్ను మెచ్చఁగ
చక్కఁగా నితఁడింతటి జాణఁడనేవే.॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!