Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6515

కడుగోల యీ చెలి కరుణించు మిఁక నీవు

రాగము: దేశాక్షి

కడుగోల యీ చెలి కరుణించు మిఁక నీవు
అడియాలపు నవ్వులే అచ్చివచ్చు మీకును॥పల్లవి॥
  
  
వింత సేయవద్దుగాని వేడుకతో నాఁటదాని
నెంత సోఁకఁ బలికినా ఇతవే కాదా
ఇంతటివాఁడవు నీవు ఇంటికి వచ్చితేఁ జాలు
దొంతి నున్న వలపులే తోడయ్యీ మీకును॥కడు॥
  
  
సిగ్గు వడవద్దుగాని సేసకు లోనైనదాని
అగ్గల మెంత నవ్వినా అరుదే కాదా
కగ్గులేని చట్టమవు కాయము ముట్టితేఁ జాలు
వొగ్గి తమకములే మేలొనరించీ మీకును॥కడు॥
  
  
మఱవఁగవద్దు గాని మనసువచ్చినదాని
తఱి నెంతఁ గూడినాను తగవే కాదా
యెఱిఁగి శ్రీ వేంకటేశ యేలితివి మా చెలిని
జఱసి జాణతనాలే చవి చూపె మీకును॥కడు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!