Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6530

కడు లా వరవు దాను కానమా నేము

రాగము: మాళవిగౌళ

కడు లా వరవు దాను కానమా నేము
యెడపదొడపఁ గాగ యెదిరించగలమా॥పల్లవి॥
  
  
నయగారి సటకాఁడు నన్నునేల తడవీనే
ప్రియురాండ్ల తోనే పెనఁగుఁ గాక
క్రియ యంత యెరిఁగితే కిమ్ముల కంబము లేదా
దయతోడిలేమలము తన కోపఁగలమా॥కడు॥
  
  
కొత్త కొత్త కోడెకాడు గోళ్లేల రాఁచీనే
చిత్తము వచ్చినవారిఁ జెనకుఁగాక
వొత్తి రాచవలసితే నూరకే రాళ్లు లేవా
తత్తరపు టింతులము తన కోపఁగలమా॥కడు॥
  
  
నీటు శ్రీ వేంకటేశుఁడు నేనెట్టు నన్నుఁ గూడెనే
వాఁటమైన వారికే వలచుఁగాక
పాటించి పట్టి బిగించ బయలుకాఁగిట లేదా
తాటించి నిండురతిని తన కోపగలమా॥కడు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!