Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6539

కడుఁ జుట్టమవు నీవు కా వంటినా

రాగము: లలిత

కడుఁ జుట్టమవు నీవు కా వంటినా
యెడయక నన్ను నిట్టె యేలుమంటిఁగాక॥పల్లవి॥
  
  
చెక్కునొక్కి నీవు నాచేయిమీఁదఁ జేయివేసి
తక్కక నవ్వు నవ్వు నవ్వఁగాఁ దగదంటినా
వొక్కతెపైఁబెట్టి మాట వొక్కొక్కటె తడవఁగా
వక్కణించ నంతేసి వద్దంటిఁగాక॥కడుఁ॥
  
  
యేపున నావద్దనుండి ఇంతకలసిమెలసి
కాఁపురము సేయఁగాను కాదంటినా
చూపి మోపి యాడోవారిసొమ్ములు మేనఁబెట్టుక
రాఁపులు సేయఁగా నందు కోపనంటిఁగాక॥కడు॥
  
  
చన్నులురమున రాయ సారెఁ గాఁగిలించుకొని
యెన్నిచేఁతలు సేసినా నేఁటికంటినా
అన్నిటా శ్రీవేంకటేశ అలమేల్మంగనే నేను
మన్నించి కూడితి విది మాననంటిఁగాక॥కడు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!