Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6594

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: పడపంజరం

కన్న విన్న కొత్త గాదు కలికితన మీకెది
మన్ననలెల్లా నిచ్చి మందలించవయ్యా॥పల్లవి॥
  
  
నానఁ బెట్టి సెలవుల నవ్వు నాముందరఁ బోసి
కానుకలు వట్టీఁ గనకపుగుబ్బలు
సానఁ బట్టినచూపుల జాజరలాడీని నీపై
పూనిననీయింతినేరుపులు చూడవయ్యా॥॥
  
  
వొడిఁ గట్టుకొని సిగ్గు లూరక నీపైఁ జల్లి
ముడుపులు గట్టిచ్చీని ముద్దుమాటలు
కడలేనిమురిపేల కందువముగ్గులు వెట్టీ
తడయక యీకెజాణతన మెంచవయ్యా॥॥
  
  
గాడిఁ గట్టి మోము చంద్రకళలెల్లాఁ దోడుచూపి
సూడిదెవట్టీఁ దనసొంపురతులు
యీడుగా శ్రీ వేంకటేశ యెవసె విన్నిటా నిన్ను
వేడుకచుట్టరికము వెలయించవయ్యా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!