Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6602

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: నారాయణి

కన్నుల నీ సంతోసము గంటిమయ్యా
సన్నల నివెల్ల మాకు సారెఁ జూపవయ్యా॥పల్లవి॥
  
  
సెలవుల నవ్వులు చెక్కిళ్ళు చెమటలు
కలిగెఁగా నేఁడు నీకుఁ గడుమేల్లయ్యా
మొలక కెంపులు మొవి, మోమున నిండుఁగళలు
తొలఁకీ నీ వన్నిన టాను దొడ్డవాఁడవయ్యా॥॥
  
  
కడగన్నుల నిద్దుర కాయమునఁ బులకలు
తడఁబడీ నీకు నేఁడు తగునయ్యా
అడియాలాలు సందున నక్కుఁన జనులొత్తులు
ఆడరె జాణఁడవు నీ వౌదువయ్యా॥॥
  
  
శిరసుపై సేసలు కురుల చెదరులును
పరగె నీయందు నేఁడు బాపురే యయ్యా
యిరవై శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
సరుగ నన్నేలితివి సరసుఁడవయ్యా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!