Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6608

కన్నుల పండుగలాయఁ గనుఁగొని మాకైతే

రాగము: కేదారగౌళ

కన్నుల పండుగలాయఁ గనుఁగొని మాకైతే
యెన్న నీ దేవుల నైనా నేమి వేడుకాయనూ॥పల్లవి॥
  
చనవిచ్చి నీ వాపెతో సరసము లాడఁగాను
చెనకి విన్నపా లాకె సేయఁగాను
యెనలేని సంతోసాన నెంతో నీవు చెలఁగఁగా
చను మొన లంట నాకె సారెఁ గొప్పు దువ్వఁగా॥॥
  
చేరి నీ వాకె నప్పటి చెక్కు నొక్కి వేఁడుకోఁగా
నారుకొనఁ దాను చిఱునవ్వు నవ్వఁగా
కూరిమిఁ గస్తూరిబొట్టు గోర నీవు దిద్దఁగాను
కోరి యాకు మడిచి తా నోర నీ కందిచ్చెను॥॥
  
కందువ నంతలో నాకెఁ గౌఁగిట నీవు నించఁగా
అందులోనే సిగ్గు పడి యాకె వుండఁగా
చెంది నన్నేలి యాకెను శ్రీ వేంకటేశ కూడఁగా
మందలించి యలమేలుమంగ నిన్నొరసెనూ॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!