Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6655

కరుణించవయ్యా కామినిని

రాగము: భైరవి

కరుణించవయ్యా కామినిని
గరిమ నివ్వెరగుల కాణాచితో నున్నది॥పల్లవి॥
  
  
జమళికానుకలు సతి నీకు వియ్యవచ్చి
సముకాన నిలిచుండీ చాఁచుమా చెయ్యి
నెమకి చెక్కులనే నిలువుటద్దాలు వట్టి
అమర నూడిగాలు నీకదివో సేసీని॥కరు॥
  
  
వేడుక మోవిపంటి విందు నీకుఁ జెప్పవచ్చి
వోడుక నిన్నుఁ జూచీ వొగ్గుమా కొంగు
వీడినకొప్పునీలాలు వెలసేసి నీకుఁ జూపి
జాడతోడ నిచ్చకాలు సారెసారె జేసి నీకును॥కరు॥
  
  
కనకపుమేనివన్నె కప్పములు నీకుఁ బట్టి
చెనకీఁ బానుపుమీఁద జేకొనరాదా
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసె నిన్నింతలోనే
వనిత నానారతుల వంతులువేసీవి॥కరు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!