Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6678

కలది గలట్టె యాడు కాదనేమా

రాగము: ముఖారి

కలది గలట్టె యాడు కాదనేమా
నిలుకడైన పనికి నీ కేల వెఱపు॥పల్లవి॥
  
  
సానఁబట్టకు చూపులు సాధించెనఁటా నాపై
ఆనలు వెట్టకు మరి అది దోసము
నానఁబెట్ట కంతేసి నవ్వులు నా మోము చూచి
నే నేమఁ(మం?) టిని నిన్ను నీకేల వెఱపు॥కల॥
  
  
కోపగించ కంత నీవు కొచ్చికొచ్చి యడగితే
పైపై సాకిరి యేల బయలయ్యీని
మోపుగట్ట కంత నీవు మొక్కులు యేకత మవునా
నీపంతము లీడేరె నీకేల వెఱవు॥కల॥
  
  
వేగిరించ కంత నిన్ను వింతుగాఁ బొగడితే
సాగఁబెట్టకు బొంకులు చవులు గావు
బాగుగా శ్రీవేంకటేశ పంతాన నన్నేలితివి
నీగుణము చక్కనాయ నీకేల వెఱపు॥కల॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!