Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6702

కలసినచోటను కడమేల

రాగము: సామంతం

కలసినచోటను కడమేల
పలుకుల నిటు వొడఁబరచఁగరాదా॥పల్లవి॥
  
యెరవుల మాటలు యెందాఁక నాడేవు
కరుణించవయ్యా కామినిని
తెరమఱఁగేఁటికి తెలిసె నీ మనసు
యిరవగు నీచనవియ్యఁగ రాదా॥॥
  
యెలయింపులుగా నెందాఁక నవ్వేవు
అలరించవయ్యా అంగనను
పలుసిగ్గులేల పైకొనెఁ దమకము
నిలిచిన నీమేలు నెరపఁగ రాదా॥॥
  
యిక్కువలు చేత నెందాఁక నంటేవు
చొక్కించవయ్య యీసుదతి నిటు
గక్కన శ్రీవేంకటేశ కూడితి
వొక్కట మన్ననలొసగఁగ రాదా॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!