Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6707

కలికి ని న్నిటు చూచీఁ గంటివా వోయి

రాగము: ఆహిరి

కలికి ని న్నిటు చూచీఁ గంటివా వోయి
తలపోసితే నీకు తరితీపు వంటిది॥పల్లవి॥
  
  
ఆసతోఁ జూచినచూపు యంటుబచ్చలివంటిది
పాసికూడినచూపు పండువంటిది
లాసి లాసి చూచే చూపు లాగవేగము వంటిది
సేసవెట్టి చూచేచూపు చిగిరింపువంటిది॥కలి॥
  
  
అల్లార్చి చూచినచూపు అట్టె గాలమువంటిది
చల్లుఁజూప కవ్రపువాసనవంటిది
చిల్లరనాఁటుఁజూపులు చిమ్ముఁదేనెలువంటివి
వెల్లవిరిఁ జూచేచూపు విడుగూళ్ళువంటివి॥కలి॥
  
  
మునుకొని చూచేచూపు మోహపుమొక్కువంటిది
వినయపుఁ జూప మోవివిందువంటిది
యెనసె శ్రీవేంకటేవ యిన్నిటాను నిన్ను నీకె
తనసిన నాచూపు తారుకాణవంటిది॥కలి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!