Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6736

కల్ల గాదు నామాట కదిసి చూడఁగదయ్య

రాగము: ముఖారి

కల్ల గాదు నామాట కదిసి చూడఁగదయ్య
చల్లువెద లిద్దరికి సగఁబాలు సుమ్మీ॥పల్లవి॥
  
దప్పిగొని వచ్చేవంటా తరుణి వాకిటనుండి
కప్పుర మిచ్చేనంటాఁ గాచుకున్నది
కప్పి నీయాదాయములో కడ నున్న నీసతికి
చప్పుడుగా కందులోన సగఁబాలు సుమ్మీ॥॥
  
బడలి వచ్చేవంటా పడఁతి మంచేనవాలు
బెడిదానఁ జల్లారఁ బెట్టుకున్నది
తడవి నీకుఁ గలితే తగ నిన్నిందాఁకఁ గూడి
జడియని యాకెకును సగఁబాలు సుమ్మీ॥॥
  
పొంతఁ గాగి వచ్చేవంటా పూజించఁగోరి నీకు
యింతేసి తామెరలు మీఁదెత్తుకున్నది
ఇంతలో శ్రీవేంకటేశ యెనసె నిన్నాకె రతి
సంతోషములాకెకును సగఁబాలు సుమ్మీ॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!