Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6741

కల్లలాడకుమీ మాటా కద్దో లేదో

రాగము: సావేరి

కల్లలాడకుమీ మాటా కద్దో లేదో
యెల్లవారిలో మా దిక్కు యేమి చూచేవయ్యా॥పల్లవి॥
  
సలిగె గద్దంటానాపె సారె నిన్నుఁ దిట్టెఁగాక
అలసి సొలసినా నే మంత సేసేమా
నెలకొని నీమన్ననే నీకుఁ బైకొని వచ్చె
యెలమిఁ దప్పక మమ్ము యేమి చూచేవయ్యా॥కల్ల॥
  
బాసగొంటినంటా నాపె బలుములు చూపెఁగాక
వేసరించినా నీతో వెగ్గళించేమా
ఆసల నీతమకమే అంతఱట్టుగాఁజేసె
యేసచూపులను మమ్మునేమి చూచేవయ్యా॥కల్ల॥
  
పట్టుపుదేవులనంటా భామ నిన్నుఁ గూడెఁగాక
యెట్టు నీవు గూడినాను ఇదేలనేమా
గుట్టున శ్రీ వేంకటాద్రి గోవిందుఁడ మమ్మేలితిఁ
విట్టె నవ్వుతా మమ్మునేమి చూచేవయ్యా॥కల్ల॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!