Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6742

కల్లలాడేదానఁ గాను కలది కలట్టే కాని

రాగము: పాడి

కల్లలాడేదానఁ గాను కలది కలట్టే కాని
మెల్లనే యిందుకుఁగా నామీఁదఁ గోపగించేవా॥పల్లవి॥
  
  
చిన్నఁబోయి వున్నాఁడవు చేరి నే మాటాడఁగ
నిన్ను నాపె మీరెనట నిజమా యిది
యెన్ని నాతో యలుకని యెరఁగనవా రాడేరు
నిన్నటినామాటలకు నీ వెగ్గు వట్టేవా॥కల్ల॥
  
  
తలపొసి చింతించేవు దైవార నే నవ్వ గాను
అలమా పెగొరనొ త్తి నందుకా యిది
చలమిది నా తోనని సంగడి వారే రెంచేరు
కలగనినే జెప్పినకత కింత సేసేవా॥కల్ల॥
  
  
సిగ్గుపడి వున్నాఁడవు చేరి నిన్నుఁ గూడఁగ
తగ్గి యాపె వరసలు తప్పెనంటా నా
నిగ్గుల శ్రీవేంకటేశ నిన్ను నేనే కూడితిని
కగ్గక నావిన్నపాలు కాదుగూడ దనేవా॥కల్ల॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!