Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6773

కాదనేనా ఇఁక నీపై గాఁతాళించేనా

రాగము: సౌరాష్ట్రం

కాదనేనా ఇఁక నీపై గాఁతాళించేనా
సాదవైతి వన్నిటాను సంగతాయఁ బనులు॥పల్లవి॥
  
  
చేయరానిచేఁత చేసి చెక్కవట్టి వేఁడుకోఁగా
ఆయనాయ నిందువంకనైనదేమి
నాయ మెవ్వరు చెప్పేరు నాకు నీకు నడుమను
చాయకుఁ దెచ్చుకొంటివి సంగతాయఁ బనులు॥కాద॥
  
  
జాలిఁబెట్టి మాటలాడి సమ్మతిగాఁ జేయఁగాను
చాలుఁజాలు నిందువంక సాదించేదేమి
తాలి మెక్కడ నున్నది తవిసితి మిద్దరము
పోలికలు చూపేవు పొసఁగె నీపనులు॥కాద॥
  
  
వెంట నాకెఁ దోడితెచ్చి వేరేమరఁగు వెట్టఁగా
కంటిఁగంటి నిందువంకఁ గలిగేదేమి
ఇంటివద్ద శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
జంటవై నెలకొంటివి చక్కనాయఁ బనులు॥కాద॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!