Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6782

కాదన్నవారికి వారికర్మమే సాక్షి

రాగము: దేసాళం

కాదన్నవారికి వారికర్మమే సాక్షి
యేదెస చూచిన మాకు నీతఁడే సాక్షి॥పల్లవి॥
  
  
వేదాలు సత్యమౌటకు విష్ణుఁడు మత్స్యరూపమై
ఆదటఁ దెచ్చి నిలిపెనది సాక్షి
ఆదిఁ గర్మములు సత్యమౌటకు బ్రహ్మాయఁగాన
పోదితో నీతఁడు యజ్ఞ భోక్తౌటే సాక్షి॥కాద॥
  
  
అదె బ్రహ్మము సాకారమౌటకు పురుషసూక్తఁ
మెదుట విశ్వరూపము యిది సాక్షి
మొదలనుండి ప్రపంచమును తథ్యమగుటకు
పొదిగొన్న యాగములే భువిలో సాక్షి॥కాద॥
  
  
బెరసి జీవేశ్వరుల భేదము గలుగుటకు
పొరి బ్రహ్మాదుల హరిపూజలే సాక్షి
యిరవై దాస్యాన మోక్షమిచ్చు నీతఁడనుటకు
వరమిచ్చే శ్రీవేంకటేశ్వరుఁడే సాక్షి॥కాద॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!