Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6784

కాదు గూడ దనరాదు కమ్మటి నీకు

రాగము: శంకరాభరణం

కాదు గూడ దనరాదు కమ్మటి నీకు
ఆదిగొని రతి నిన్నే ఆయము లంటుదురు॥పల్లవి॥
  
  
చనవు గలిగినాపె సణఁగులు రాల్చితే
ననవు గలిగినాపె నవ్వఁ జూచును
వొనర నీవిద్దరిని వొక్కటి సేయఁ జూచితే
వెనుకొని నిన్నే తాను వెంగెము లాడుదురు॥కాదు॥
  
  
సేసపెండ్లికూఁతురు చేతులు చాఁచితేను
ఆసవడ్డ పెండ్లికూఁతు రడ్డాలు దొచ్చు
వేసరక యిరుమేలా వెస నీవు గైకొంటే
తాసువలె నీతోనే పంతాలు నెరపుదురు॥కాదు॥
  
  
భూసతి నీసేవ సేసి బుజముపై నెక్కితేను
శ్రీ సతి నీవురము మచ్చిక నెక్కెను
ఆసల శ్రీ వేంకటేశ ఆపె నీపై నేలితివి
మోసపోక తాము నీపై మోము చల్లుదురు॥కాదు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!