Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6805

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: శుద్ధదేశి

కానవచ్చె నాపై నీపైఁ గల వెూహమెల్లాను
ఆనుకొన్న వవి యెట్టియడియాసలో॥పల్లవి॥
  
  
చిత్తగించి చూడవయ్య చిరునవ్వు నవ్వీ నాపె
యిత్తల నీయాపె సఁది నెంత వనిలో
కొత్తకొత్తచెమటలు గోర నీపైఁ జిమ్మీని
తత్తరాన నది యెట్టి తడఁబాటులో॥॥
  
  
వేడుకతో వినవయ్య విన్న వించఁబూనీ నాపె
వోడక నీకాపె కెంత వొడఁబాటులో
వాడిక సన్నలవే వలపులు నీపైఁ జల్లీ
యీడుజోడయిన సుద్దు లెటువంటివో॥॥
  
  
అఁది కాఁగిలించుకొనవయ్య నీకు మొక్కీ నాపె
విందుల నీకాపె కెట్టివేడుకలో
యిందునె శ్రీవేంకటేశ యేలితి వీకె నింతలో
సందడి సేఁత లేరీతి సరసములో॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!